Saturday, July 9, 2011

స్టార్ హీరోలను మించిపోతున్న డైరెక్టర్స్ రేటు...

[NENINTHE1.jpg]

ఈ వేళ ఒక సినిమా మొత్తం బడ్జెట్ లో సగం తారల పారితోషికాలకే వెళ్లిపోతోందనేది నిర్వివాదాంశం. అయితే, కోట్లలో పారితోషికాలు తీసుకునే టెక్నీషియన్లు కూడా వున్నారు. టాలీవుడ్ లో రెండు నుంచి ఐదు కోట్లు చార్జ్ చేసే దర్శకులు కూడా ఎక్కువ మందే వున్నారు. ఇప్పుడు వీళ్లని తలదన్నేలా కోలీవుడ్ దర్శకుల రేమ్యునేరేషన్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తమిళ దర్శకులు శంకర్, మురుగదాస్ లు తీసుకునే పారితోషికాల రేటు వింటే మనకు కళ్ళు తిరిగిపోతాయి.

వీరిద్దరూ కూడా ఒక్కో సినిమాకు 12 కోట్లు తీసుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ‘శివాజీ’, 'రోబో' సినిమాతో శంకర్, 'గజని' సినిమాతో మురుగదాస్ ల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయిందనీ, వీరి సినిమాలకు తమిళంతో బాటు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉందనీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, వీరిద్దరూ అంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు వారి వెంట పడుతున్నారు. ఒక వేళ సినిమా హిట్ అయితే నిర్మాతకు ఫర్వాలేదు కానీ, ఒకవేళ వీరి డైరెక్షన్ లో చేసిన సినిమా ఫట్ అయితే..అప్పుడు నిర్మాత నెత్తిన తడిబట్టే