Saturday, July 9, 2011

వినాయక్ చరణ్ ని ‘మెరి’పిస్తాడా...!



ఆరెంజ్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకడు ధరణితో ‘మెరుపు’ అనే సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా కమిట్ అయిన ఈ చిత్రం దాదాపు మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆరెంజ్ ఊహించని రీతిలో ప్లాప్ కావడం, ఈ సినిమాకి భారీ రేంజ్ లో బడ్జెట్ ఎస్టిమేట్ కావడంతో చరణ్ రిస్క్ ఎందుకని ఈ సినిమాని పక్కన పెట్టి సంపత్ నందితో ‘రచ్చ’ సినిమాకి కమిట్ అయ్యాడు.

దీంతో ఈ సినిమా నుండి దర్శకుడు ధరణి, హీరోయిన్ కాజల్ ఇద్దరూ తప్పుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో రామ్ చరణ్ ‘మెరుపు’ ఆగిపోలేదని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో దాదాపు అటకెక్కేసిందనుకున్న ఈ సినిమాపై మళ్ళీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర కథకి మరికొన్ని మాస్ హంగులు అద్ది కమర్షియల్ దర్శకుడు వివి వినాయక్ దర్శక్వంలో వహించబోతున్నాడని తెలుస్తుంది. వచ్చే నెలలోనే సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన డేట్స్ ను ఎడ్జస్ట్ చేసుకుంటున్నాడట. మరి అల్లు అర్జున్ ని బోల్తా కొట్టించిన వినాయక్ కనీసం చరణ్ నైనా మెరిపిస్తాడేమో చూడాలి