Tuesday, July 12, 2011

పవన్ కళ్యాణ్ టైటిల్ తో గౌతమ్బ్రహ్మానందం కుమారుడు గౌతమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రానికి 'లవ్ లీ ' అనే టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ని మొదట పవన్ కళ్యాణ్ తన తీన్ మార్ చిత్రానికి పెడదామనుకున్నాడు. కానీ మాస్ టైటిల్ కావాలని మార్చుకున్నాడు. అయితే టైటిల్ జనాల్లో బాగా నలిగి ఉండటంతో తమకు క్రేజ్ వస్తుందని ఆ టైటిల్ తమ చిత్రానికి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రామరాజు అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. శాన్వీ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారు ఇంతకుముందు వీర చిత్రం నిర్మించారు. ఇక హీరో గౌతమ్ చివరి చిత్రం వారెవా.. భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఈ మూడవ చిత్రంతో అయినా హిట్టు వస్తుందని ఆశతో ఉన్నాడు