Tuesday, July 12, 2011

'ది బిజినెస్ మ్యాన్' లో కాజల్ లేదు


మహేష్, అభిషేక్ బచ్చన్ లతో "ది బిజినెస్ మ్యాన్" చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు వెర్షన్ లోకి మొదట కాజల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అయితే హిందీ వెర్షన్ కి మాత్రం కాజల్ ను డ్రాప్ చేసారు పూరీ. ఈ విషయం చెప్తూ...కాజల్ ది బిజెనెస్ మ్యాన్ హిందీ వెర్షన్ లో లేదు. అబిషేక్ బచ్చన్ ప్రక్కన ఆమెను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మేము ప్రెష్ ఫేస్ కోసం వెతుకుతున్నాము. అయితే ఆమె తెలుగు వెర్షన్ లో మాత్రం ఆమెనే ఉంచాము అన్నారు. దానికి కారణం..ఆమె సింగం సినిమా ద్వారా బాలీవుడ్ కి పరచయమవటమేనని తెలిసింది. పూరీ మొదట ఆమెను హిందీకి తీసుకుందామనుకున్నప్పుడు ఆమె హిందికి పరిచయం కాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారటంతో నావల్టీ ఉండదని ఈ డెసిషన్ తీసుకున్నారని సమాచారం