Saturday, July 9, 2011

మెహర్ రమేష్ డైరెక్షన్ లో రవితేజ..


భారీ చిత్రాలకు, కమర్షియ చిత్రాల ను తీయటంలో దిట్ట అనిపించుకొన్నాడు మెహర్ రమేష్. మెహర్ సినిమాలు చూడ్డానికి చాలా కమర్షియల్ గా ఉన్నా కథలో డెప్త్ లేకపోవడంతో సినిమాలు ఫ్లాప్ అవుతాయన్నడానికి నిదర్శనం ‘శక్తి’యే...బిళ్ళా, కంత్రి, శక్తి వంటి భారి సినిమాలు చేసినా టాలీవుడ్ లో తగిన గుర్తింపు రాలేదు.

ఇటీవల 'శక్తి' వంటి భారీ ఫ్లాప్ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు మెహర్ రమేష్, మరో సినిమా కోసం గత కొంత కాలంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు హీరోలను అప్రోచ్ అయినా, ఫలితం లేకపోవడంతో తాజాగా రవితేజాను కాంటాక్ట్ చేశాడట.

రమేష్ చెప్పిన కథకు పడిపోయిన రవితేజ ఆ సినిమా చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా ఉన్నారట. ఏది ఏమైనా, ఈసారి హిట్ కొట్టి, తానేమిటో రుజువు చేసుకోవాలని మెహర్ కసి మీద ఉన్నాడట