Tuesday, July 12, 2011

రచ్చ' గురించి రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ లో



రామ్ చరణ్ తేజ్ తన తాజా చిత్రం 'రచ్చ' గురించి ట్విట్టర్ లో తాజాగా ఓ ట్వీట్ చేసారు. అందులో ఏమని ని ఉందంటే...మణిశర్మ రచ్చ చిత్రానికి రెండు మైండ్ బ్లోయింగ్ ట్యూన్స్ ఇచ్చాడు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మీకు కూడా ఈ పాటలు నచ్చుతాయనుకుంటున్నాను. వాటిని ఎప్పుడు షూట్ చేస్తారా అన్నంత ఆసక్తి గా ఉంది. రచ్చ చాలా బాగా వస్తోంది. నేను నా టీమ్ మొత్తం తో చాలా హ్యాపీగా ఉన్నాను. మరో విషయం ఏమిటంటే తమన్నా చాలా డిడికేటెడ్ గా పనిచేస్తోంది. ఆమెతో పనిచేయటం చాలా ప్లెజెంట్ గా ఉంది అన్నాడు.

ఇక మెగా సూపర్‌గుడ్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్‌ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. జూలై 3వ తేదీ నుంచి శ్రీలంకలో హీరో,హీరోయిన్స్ పై పాటను షూట్ చేస్తున్నారు. వందశాతం మాస్‌ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్‌ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి