Tuesday, July 12, 2011

పవన్ పంక్షన్ కి సల్మాన్ ఖాన్ హాజరు!


పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ ఆడియో పంక్షన్ కి సల్మాన్ ఖాన్ హాజరవుతారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఎందుకంటే దబాంగ్ తమిళ రీమేక్ ఆడియోకి సల్మాన్ వస్తున్నాడు. శింబు హీరోగా చేస్తున్న ఈ సినిమాపై మంచి ఆసక్తిగా ఉన్న సల్మాన్ తనే వస్తానని చెప్పాడు. దాంతో తెలుగుకి సైతం వస్తాడని అంచనాలు వేస్తున్నారు. ఇక సల్మానే స్వయంగా వస్తానంటే కాదనేదేముంది అంటున్నారు. మరో ప్రక్క సల్మాన్ కీ, పవన్ కీ మంచి స్నేహం ఉంది. చిరంజీవి టైమ్ నుంచి సల్మాన్ ఇక్కడకు వచ్చినప్పుడు హాయ్ చెప్తూంటాడు మెగా కుటుంబానికి. అందులోనూ ఇప్పుడు సల్మాన్ దృష్టి అంతా సౌత్ పైనే ఉంది. ఇక్కడ రీమేక్ లతో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సల్మాన్ ఇక్కడ హీరోల తోనూ స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇక తమిళ వెర్షన్ మొదట రిలీజై తర్వాత తెలుగు వర్షెన్ వచ్చే అవకాశముంది. సంక్రాంతికి గబ్బర్ సింగ్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు.హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రిప్టుని పూర్తిగా నేటివిటీకి మార్చి రాసాడని వార్త