Saturday, July 9, 2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పథకాలు

ఇడుపులపాయ(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ఈరోజు ఇక్కడ జరుగుతున్న పార్టీ ప్రజాప్రస్థాన ప్లీనరీ సమావేశాలలో పార్టీ విధివిధానాలను, సంక్షేమ పథకాలను ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను ఆయన వివరంగా తెలిపారు. ఆ మహానేత కడుపున ఆణిముత్యమే పుట్టాడని చెప్పుకునే విధంగా స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఆయన తెలిపిన పథకాలలో కొన్నింటిని ఈ దిగువ ఇస్తున్నాం. 1. రాష్ట్రంలో తొలిసారిగా రైతు బడ్జెట్ ప్రవేశం 2. రైతులకు వడ్డీలేని రుణాలు. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 3. మహిళలకు వడ్డీలేని రుణాలు. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 4. వైఎస్ఆర్ అమ్మ ఒడి పథకం : ఈ పథకం కింద తన పిల్లలను బడికి పంపించేందుకు ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్­లో 500 రూపాయలు జమ చేస్తారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తారు. పిల్లలు ఇంటర్­లోకి వచ్చేసరికి దానికి 750 రూపాయలకు పెంచుతారు. డిగ్రీలోకి వచ్చిన తరువాత వెయ్యి రూపాయలకు పెంచుతారు. 5. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పెంపు. 6. ఏడాదికి పది లక్షల ఇళ్ల నిర్మాణం 7. ప్రతి రైతు కూలీ కుటుంబానికి ఒక ఎకరా భూమి పంపిణీ 8. రైతులకు వ్యవసాయంలో సలహాల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలతో 103 వాహనాలు 9. పశువులకు, మేకలకు వైద్యం కోసం వెటర్నరీ డాక్టర్లతో 102 వాహనాలు. 10. ప్రతి మండలానికి ఒక 104 వాహనం 11. రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచడం. 12. రైతులకు మద్దతు ధర కోసం ప్రత్యేక నిధి 13. ఆరోగ్యశ్రీ పథకం మెరుగుపరచడం