Tuesday, July 12, 2011

మహేష్ చిత్రంపై క్లారిఫై చేసిన పూరీ



మహేష్ తో పూరీ జగన్నాధ్ ది బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ తో చేయనున్న ఈ వెర్షన్ ని మహేష్ తో పాటు చేస్తారా లేదా అన్న విషయాలను ఆయన మీడియాకు క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ...తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ ఒకేలా ఎందుకుంటాయి. ఒకటి ప్రత్యేకంగా మహేష్ కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడేలా డిజైన్ చేసింది. మరొకటి అభిషేక్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చేలా చేసిన స్క్రిప్టు. అలాగే నేను తెలుగు వెర్షన్ కి రీమేక్ లాగ దీన్ని తీర్చిదిద్దదలుచుకోలేదు. అయితే రెండు చిత్రాలకు నేపధ్యం మాత్రం ముంబై మాత్రమే. అక్కడే కథ జరుగుతుంది. కథలో మార్పులు మాత్రం ఉంటాయి. అలాగే హీరోయిన్ గా కాజల్ ని కూడా తెలుగుకే పరిమితం చేసి హిందీకి వేరే ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను. మహేష్ బాబు తో తెలుగు వెర్షన్ ని వచ్చే నెలలో ప్రారంభిస్తాను అన్నారు