Sunday, July 10, 2011

'గబ్బర్ సింగ్' ది ఒరిజినల్ కాదు: గణేష్ బాబు


వాటికీ మాకూ సంభందం లేదు.అవి కొందరు పవన్ అభిమానులు క్రియేట్ చేసినవి.అవి నెట్ లో పెట్టారు. అంటూ గణేష్ బాబు చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ కొత్త స్టిల్స్ అంటూ నెట్ లో ఆ మధ్యన వచ్చిన కొత్త స్టిల్స్ పై నిర్మాత గణేష్ బాబు స్పందించారు.అలాగే తాము ఇప్పటివరకూ ఇంకా ఫోటో షూట్ కూడా జరపలేదని, మీడియావారు ఈ స్టిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఆ మధ్యన ఊసరివిల్లి చిత్రానకి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది.ఊసరివిల్లి ఫోస్టర్ అంటూ నెట్ లో కనిపించింది ఒరిజనల్ కాదంటూ ఆ తర్వాత దర్శక,నిర్మాతలు చెప్పాల్సి వచ్చింది.ఇప్పుడు గబ్బర్ సింగ్ కూ ఈ సమస్య వచ్చింది. ఇక గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ ఎంపికైంది.హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రిప్టుని పూర్తిగా మార్చి తెలుగు నేటివిటీకి అనుగుణంగా పంచ్ డైలాగులతో రాసారని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ గా రూపొందే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు